25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

జేసీబీ, నాలుగు టిప్పర్లు సీజ్

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అక్రమంగా మొరం తవ్వుతున్న జేసీబీ, నాలుగు టిప్పర్లను సీజ్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ అంజయ్య తెలిపారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, టాస్క్ ఫోర్స్ ఏసీపీ నాగేంద్ర చారి ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు. చిన్న మావంది గ్రామ శివారులోని హరిద్ర నది లో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా తవ్వకాలు చేస్తున్న ఒక జేసీబీ, నాలుగు టిప్పర్లను పట్టకుని సీజ్ చేసినట్లు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం బోధన్ రూరల్ ఎస్ఎచ్ఓకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

More articles

Latest article