వెబ్ న్యూస్, బతుకమ్మ : మరోసారి సొంతపార్టీ నేతలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు బీజేపీ నేతలు ఫాల్తుగాళ్లంటూ విమర్శించారు. అలాగే ఓవైసీ బ్రదర్స్ తీరుపై ఆయన మండిపడ్డారు. పవిత్రమైన రంజాన్ మాసంలో హిందువులపై ఒవైసీ బ్రదర్స్ విషం కక్కుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే పారిపోయే మొదటి వ్యక్తి ఓవైసీ అని వ్యాఖ్యనించారు. అసదుద్దీన్ ఒవైసీకి మెంటల్ వచ్చిందని… ట్రీట్మెంట్ ఇప్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని రాజాసింగ్ కోరారు.
