27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

జైలు నుంచి కవిత విడుదల

Must read

📰 Generate e-Paper Clip

  • మద్యహ్నం బెయిల్..రాత్రి  జైలు నుంచి విడుధల
  • 163 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు
  • స్వాగతం పలికిన  కవిత భర్త అనిల్,కేటి ర్, హరీష్ రావు
  •  బావోద్వేగానికి గురైన కవిత
  •  ఫైటర్ ను.. వడ్డితో సహ తిరగి చెల్లిస్తా
  • రేపే  రాష్ట్రానికి కవిత రాక

బతుకమ్మ, హైదరాబాద్ : నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలు నుంచి విడుదలయ్యారు. మంగళవారం సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తయిన తర్వాత న్యాయమూర్తులు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేశారు. మంగళవారం రాత్రి కవిత తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు. దాదాపు 163 రోజుల తర్వాత కవిత విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్ లోని తన నివాసం నుంచి ఈడి అధికారులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే.

Kavitha released from jailఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముందుగా ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేయగా అందులో ఏ5గా కవితను చేర్చారు . ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక వ్యక్తుల్లో ఒకరైనా మనీష్ సిపోడియాకు న్యాయస్థానం బెయిల్ మంజూరి చేయడంతో ఆగస్టులో కవితకు బెయిల్ మంజూరి కావడం ఖాయమని ప్రచారం జరిగింది. గత పది రోజులుగా బీఆర్ఎస్ నాయకులు ప్రధానంగా కవిత జాతీయ అధ్యక్షురాలిగా ఉన్న జాగృతి నాయకులు కూడా ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. మంగళవారం చివరిసారిగా బెయిల్ పై వాదనలు ఉంటాయని, కచ్చితంగా న్యాయస్థానం బెయిల్ ఇస్తుందని నమ్మకంతో సోమవారం ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో మంగళవారం రాత్రి తీహార్ జైలు వద్ద కవిత భర్త అనిల్, సోదరుడు తారక రామారావు, మాజీ మంత్రి హరీష్ రావు, గంగుల కమలాకర్, ఎంపీలు, ఎమ్మెల్సీలు కవితకు స్వాగతం పలికారు.

Kavitha released from jail జైలు నుంచి విడుధలైన కవిత బావోద్వేగానికి గురయ్యారు. తన భర్త, పిల్లలు, సోధరుడిని అలింగనం చేసుకోని బావోద్వేగానికి గురయ్యారు. తాను కేసిఆర్ కుతురును , తెలంగాణ బిడ్డను నేను తప్పు చేసే ప్రశ్నేలేదని అన్నారు. తాను మంచిదానినని తనను మొండిదానిగా మార్చారని అన్నారు.

Kavitha released from jailతనపై జరిగింది రాజకీయ ప్రేరేపిత కుట్ర అని అది దేశ ప్రజలకు తెలుసు అన్నారు. తానేప్పుడు తప్పు చేయలేదని 18 సంవత్సరాలుగా పైటర్ గా ప్రజలకు రాజకీయంగా సేవా  చేశానని ఇఫ్పుడు కుడా  పైటర్ గా తనపై జరిగిన దానికి వడ్డితో సహ చెల్లిస్తానని అన్నారు. కష్ట సమయంలో తనకు తన కుటుంబానికి తోడు ఉన్నవారికి దన్యావాదాలు తెలిపారు. ఐదున్నర నెలలు తన కుటుంబానికి దూరం చేసినందుకు భాదగా ఉంది. రాబోయే రోజులలో తాను నిర్ధోషిగా బయటకు వస్తాను అన్నారు. ప్రజా క్షేత్రంలో కమిట్ మెంట్ తో పని చేస్తానని అన్నారు.తనను తన పిల్లలను ఐదున్నర నెలలుగా దూరం చేయడం బాధ కలిగించిందని అన్నారు. బుధవారం మధ్యాహ్నం కవిత హైదరాబాద్ కు రానున్నట్లుతెలిసింది. కవిత జైలు నుంచి విడుదల కావడంతో జాగృతి, బీఆర్ఎస్ నాయకులు సంబరాలు నిర్వహించారు.

Kavitha released from jail

More articles

Latest article