27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అర్హులందరికీ ఉపాధి

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: గ్రామాలలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ ద్వారా పని కల్పించడం జరుగుతుందని ఎంపీడీవో తిరుమల దేవి అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో బుధవారం నిర్వహించిన గ్రామ సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శెట్ పల్లి, పాలెం ధర్మోరా సుంకెట్మోర్తాడ్ ఐదు గ్రామాల్లో బుధవారం ఉపాధి హామీ సామాజిక తనిఖీ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఎంపీవో శ్రీధర్,  ఏ పీవో శకుంతల, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, కారోబార్లు సాయన్న, పృథ్వీరాజ్, ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు చంద్రమోహన్, శ్రీనివాస్, శంకర్,  జాన్సన్,  పంచాయతీ సిబ్బంది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article