బతుకమ్మ మోర్తాడ్: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన భోజనం అందించాలని మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి అన్నారు. మోర్తాడ్ మండలంలోని వడ్యాట్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. పాఠశాలలోని వంటగదిని, స్టోర్ రూమ్ లో ఉన్న కురగాయాలు, బియ్యం, ఇతర సామాగ్రిని పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
