27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రోడ్డు సేఫ్టీ పరికరాల బిగింపు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: ఎన్ హెచ్ 44 పై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మండలంలోని సిద్ధ రామేశ్వర నగర్ గ్రామం వద్ద సేఫ్టీ పరికరాలను సోమవారం బిగించారు. ఈ మేరకు సేఫ్టీ పరికరాల బిగింపు ను భిక్కనూరు సీఐ సంపత్ కుమార్, ఎస్సై ఆంజనేయులు పరిశీలించి మాట్లాడారు. ఇటీవల వరుస యాక్సిడెంట్లు జరగగా అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి స్పాట్లను విజిట్ చేసి నేషనల్ హైవే అథారిటీ అధికారులతో మాట్లాడి సేఫ్టీ పరికరాలను బిగించే చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. సేఫ్టీ పరికరాలను బిగించినందుకు సిద్ధ రామేశ్వర నగర్ ప్రజలు అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డికి, భిక్కనూరు సీఐ, ఎస్సై, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article