30.9 C
Hyderabad
Monday, August 3, 2026

రోడ్డెక్కిన పసుపు రైతులు

Must read

📰 Generate e-Paper Clip

మద్దతు ధర ప్రకటించాలని ధర్నా

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని పసుపు రైతులు సోమవారం నగరంలోని బస్టాండ్ వద్ద మెరుపు ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి మార్కెట్ యార్డుకు వచ్చిన రైతులు తాను కష్టపడి పండించిన పసుపు పంటకు గిట్టుబాటు ధర లేదని నగరలో మెరుపు ధర్నా నిర్వహించారు. పసుపు మద్దతు ధర ఇస్తామన్న హామీలు నెరవేరలేదన్నారు. మార్కెట్ యార్డులో అధికారులు ప్రకటించిన ధర దక్కకుండా వ్యాపారులు, దళారులు మోసం చేస్తున్నార్నారు. పసుపు మద్దతు ధరపై జిల్లా కలెక్టర్ వచ్చి భీష్మించుకు కూర్చున్నారు. రైతుల ధర్నాతో రోడ్డు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు.
Turmeric farmers take to the streets

More articles

Latest article