27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

  • నివాళులు అర్పించిన బోధన్, అర్బన్ఎమ్మెల్యేలు, నగర మేయర్, కలెక్టర్
  • ఆయన చూపిన అడుగు జడలు నేటి యువత నడవాలి

బతుకమ్మ న్యూస్ నిజామాబాద్ సిటీ: తెలంగాణ ఉద్యమ నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన నేత ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ అని బోధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేలు, నగర మేయర్ దండు నీతూ కిరణ్ లు పేర్కొన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ లో గల ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్దకు పలువురు చేరుకొని పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని ప్రతి ఒక్కరు రగిలించి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రతి ఒకరిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణం సైతం లెక్కచేయకుండా ఉద్యమించిన మహా వ్యక్తి జయశంకర్ అని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయ సాధనల కోసం ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువతఆదర్శంగా పనిచేయాలన్నారు.

More articles

Latest article