- 9మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న 9మందిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ అంజయ్య తెలిపారు. ఆర్మూర్ మండలంలోని రాంపూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్, స్పెషల్ పార్టీ సిబ్బంది దాడి చేశారని తెలిపారు. ఈ దాడిలో 9మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి 5 సెల్ ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలు, రూ.45,110నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం ఆర్మూర్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.
