నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రోడ్డు భవనాల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ కార్యాలయం నందు సుదీర్ఘకాలం పాటు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా సేవలందించి, నిజామాబాద్ డివిజన్ కార్యాలయం నందు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పదోన్నతి పొంది పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీమన్నారాయణను టిఎన్జీవోస్ ఆధ్వర్యంలో సోమవారం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, సహాధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి, టీఎన్జీవో కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు అతిక్ అహ్మద్, అర్బన్ యూనిట్ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్, సంయుక్త కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
