25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

మధ్యాహ్నం వెళ్లి ఓటేయండి..

Must read

📰 Generate e-Paper Clip

. ప్రైవేట్, కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నతాధికారుల సూచన

. ఎండలో ఎలా వెళ్లేది.. ? అంటున్న గ్రాడ్యుయేట్లు

నిజామాబాద్, బతుకమ్మ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గ్రాడ్యుయేట్లకు తిప్పలు తప్పడం లేదు. ఓ వైపు ఎన్నికల కమిషన్ నుంచి సాధారణ సెలవు ఇవ్వాలని లేదా డ్యూటీ టైమింగ్స్ లో వెసులుబాటు కల్పించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రైవేట్, కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ ఉద్యోగులను లంచ్ టైమ్ లో వెళ్లి ఓటు వేయాలని యాజమాన్యాలు సూచిస్తుండగా, కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న వారిని మధ్యాహ్నం నుంచి డ్యూటీ నుంచి వెళ్లిపోయి ఓటు వేయాలని సూచిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలున్నప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు ఉన్న ప్రాంతాల్లో సెలవు ఇవ్వలేదు. మధ్యాహ్నం వేళ వెళ్లి ఓటు వేసి రావాలని సూచిస్తున్నారు. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉంటుందని ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు.

Go and vote in the afternoon..

More articles

Latest article