30.2 C
Hyderabad

ఆదివారం ’క్రికెట్ కనుల విందు‘

Must read

📰 Generate e-Paper Clip

హైవోల్టేజీ మ్యాచ్ టీవీలకు అతుక్కుపోనున్న అభిమానులు

వెబ్ న్యూస్, బతుకమ్మ :   దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫిలో ఆదివారం చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాక్ తలపడుతున్నాయి. పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోపికి అతిథ్యం ఇస్తోంది.  అతిథ్య హోదాలో పాక్ తన మొదటి మ్యాచ్ లో ఓడిపోయి ఒత్తిడిలో ఉంది. భారత్ తన మొదటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో  గెలిచి జోరు మీద ఉంది. ఇండియా ఈమ్యాచ్ లోను గెలిచి సెమిస్ బెర్త్ ఖాయం చేసుకోవాలని చూస్తోంది. ఈనేపథ్యంలో టాస్ కీలక పాత్ర పోషించనుంది. ఈస్టేడియంలో మొత్తం 59 మ్యాచ్ లు జరగ్గా, తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు కేవలం 22  మ్యాచ్ లు నెగ్గింది. ఈమ్యాచ్ పై బెట్టింగ్ జోరుగా కొనసాగుతోంది. యూపీలోని వారణాసిలో  పలువురు ఇండియా గెలవాలని పూజలు చేస్తున్నారు.

More articles

Latest article