కామారెడ్డి, బతుకమ్మ : తోటి విద్యార్థి అవమానిచించిందని ఇద్దరు విద్యార్థులు గుర్తుతెలియని మందు తాగిన ఘటన రామారెడ్డి మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలంలోని ఒక పాఠశాలలో తోటి విద్యార్థీ అవమానించిందని పదవతరగతి విద్యార్థీ గుర్తు తెలియని ముందు తాగింది. పదోతరగతి విదార్థి చెల్లి కూడా అదే పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. తన అక్క తాగిన మందును నీరు అనుకోని ఆమె కూడా తాగింది. దీంతో గ్రామం ఒక్కసారి ఉలిక్కి పడింది. విద్యార్థులను ఇద్దరిని కామారెడ్డి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
