27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

గిరిరాజ్ కళాశాలలో మెగా జాబ్ మేళా

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని గిరిరాజ్ కళాశాలలో తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్, కెరీర్ గైడెన్స్ విభాగాల ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్సు ఇండియా ఫౌండేషన్ వారి సౌజన్యంతో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. చదువుతో పాటు విద్యార్థుల వ్రుత్తి నైపుణ్య శిక్షణ, ఉద్యోగ కల్పనలో గిరిరాజ్ కళాశాల ఎప్పుడూ ముందుంటుందని ప్రిన్సిపాల్ డా.రామ్ మోహణ్ రెడ్డి తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో వివిధ ఉద్యోగాలకు 600పైగా విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. వీరిలో 362 విద్యార్థులు తదుపతి రౌండ్ కు సెలక్ట్ అయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, మ్యాజిక్ బస్ మేనేజర్ చందర్, ప్రతినిధులు రమేష్, నరేష్, వివిధ కంపెనీల హెచ్ఆర్ లు, టిఎస్కే సి మోటార్ శ్రీకాంత్, కళాశాల ఉపన్యాసకులు పాల్గొన్నారు.

Mega Job Mela at Giriraj College

More articles

Latest article