27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

వృద్దురాలి మెడలో నుంచి గొలుసు చోరి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగరంలోని బోర్గాం(పి)లో పట్టపగలు వృద్దురాలి మెడలో నుంచి బంగారు గొలుసును అగంతకుడు తెంపుకెళ్లాడు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. 4వ టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపిన కథనం ప్రకారం బోర్గాంలోని సుంకరి కళావతి అనే వృద్దురాలు తన ఇంటి ఆవరణలో కూర్చోని ఉండగా గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వచ్చి ఆమెను పలుకరించినట్లు చేసి మెడలోని 9 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని పరారీ అయ్యారు. వృద్దురాలు కేకలు వేసినా అప్పటికే అగంతకుడు పరారయ్యారు. సంఘటన స్థలాన్ని నగర సిఐ రాజశేఖర్ రాజు, పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు.

 

 

 

More articles

Latest article