ఆర్మూర్, బతుకమ్మ : ఆలూర్ మండలం లోని గుత్ప గ్రామం లో రవీందర్ గౌడ్ కు ముఖ్యమంత్రి ఆర్థిక సహాయనిది నుంచి మంజూరైన రూ.36 వేల చెక్కును బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి, అదేవిధంగా నిధులను మంజూరు చేయడంలో కృషి చేసిన ఆర్మూర్ నియోజకవర్గ ఇంఛార్జి వినయ్ కుమార్ రెడ్డి,ముక్కెర విజయ్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ ఎన్ యస్ యు ఐ అధ్యక్షులు బాశెట్టి శశి కుమార్, మాజీ సర్పంచ్ చిన్నయ్య, నాయకులు భూమేశ్వర్, హైమద్, భూమన్న, సంజీవ్ , అశోక్,నాగు,పోషన్న,శోభన్, సతీష్ , సాయిలు, రాజేశ్వర్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
