27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సీఎం చిత్రపటానికి ఎమ్మార్పీఎస్ నాయకుల పాలాభిషేకం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు : ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలి చిత్రపటాలకు మంగళవారం భిక్కనూరులో పాలాభిషేకం చేశారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకై ఎన్ని ఉద్యమాలు చేసినా ఇప్పటివరకు గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణకు ఆమోదం చెప్పడం సంతోషకరమైన విషయం అన్నారు. ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భిక్కనూరు మండల ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article