- దేవతావిగ్రహాల పునః ప్రతిష్ట
- అయ్యప్ప నామ స్మరణతో మారుమ్రోగిన అభినవ శభరిమాల
భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ చొక్కయ్యగుట్ట అభినవ శభరిమాల క్షేత్రం లో వేదపడింతులు మహా కుంభాభిషేకం కార్యక్రమంను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చివరి రోజైన శనివారం వేదపండితులు అయ్యప్ప గర్భలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.అనంతరం కుంభభిషేకం నిర్వహించి,స్వామి వారికి పంచామృతాలు, పంచగావ్యాలు, సుగంధ ద్రవ్యలతో మహా అభిషేకం నిర్వహించారు.

తదనంతరం గణపతి, సుబ్రహ్మణ్యస్వామిల విగ్రహాలను పునః ప్రతిష్ట చేశారు. హోమాలు, పూజ క్రాతువులను వేదపండితులు నిర్వహించారు. భక్తులకు ప్రసాద వితరణ చేసి అన్నధాన కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మనాల మోహన్ రెడ్డి లు, పట్టణ, మారుమూల గ్రామాల ప్రముఖులు,భక్తులు అయ్యప్ప సేవాసమితి కార్యవర్గం, సభ్యులు పాల్గొన్నారు.

