27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ఏఐకేఎంఎస్ జిల్లా కార్యవర్గ సభ్యులు అనారోగ్యంతో మృతి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలంలో గల తాళ్ల రామడుగు గ్రామానికి చెందిన అఖిల భారత రైతు కూలి సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా కార్యవర్గ సభ్యులు దత్తాద్రి  శనివారం అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ అన్నారు. దత్తాద్రి పేద ప్రజల కోసం రైతంగ సమస్యలపై అనేక పోరాటాలు చేశాడని ఆయన అన్నారు. ఆయన   మృతి చెందడం బాధాకరమని అన్నారు. అఖిల భారత రైతు కూలిసంఘం ఏఐకేఎంఎస్ నిజామాబాద్ జిల్లా కార్యవర్గం ఆయనకు విప్లవ జోహార్లు అర్పిస్తూ ఆయన ఆశయాలు కొనసాగిస్తామని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి తెలిపారు.

More articles

Latest article