బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డిఎంహెచ్వో ప్రభు కిరణ్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని ఫార్మసీ, ల్యాబ్, ఆస్పత్రి పరిసరాలు, ఓపి వివరాలు పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, గర్భిణీ స్త్రీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించుకొని ధైర్యాన్ని నింపాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య పరీక్షలు నిర్వహించాని, టీకాల వివరాలు, రికార్డులు పరిశీలించారు. ఈ పరిశీలనలో మెడికల్ అధికారి ఏమిమా, దివ్య, హెచ్ ఈ ఓ వెంకటరమణ, హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు ఉన్నారు.
