26.2 C
Hyderabad
Monday, August 3, 2026

మోహన్ బాబుకు ముందస్తు బెయిల్

Must read

📰 Generate e-Paper Clip

. విలేకరిపై దాడి కేసులో మంజూరు చేసిన సుప్రీం కోర్టు

వెబ్ న్యూస్, బతుకమ్మ: జర్నలిస్టుపై దాడి కేసులో సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో మోహన్ బాబు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గాయపడిన విలేకరికి ఆర్థిక సాయం చేస్తామని మోహన్  బాబు ప్రకటించారని, ఆస్పత్రికి వెళ్లి జర్నలిస్టును పరామర్శించారని మోహన్ బాబు తరఫు న్యాయవాది ధర్మాసనం ఎదుట వివరించారు. పూర్తిగా కుటుంబ వ్యవహారమని, తండ్రి, కొడుకులకు మధ్య ఉన్న వివాదంతో బయటి ప్రపంచానికి సంబంధం లేదని విన్నవించగా, గాయపడిన జర్నలిస్టు ప్రస్తుత పరిస్థితి ఏమిటని ధర్మాసనం  న్యాయవాదిని ప్రశ్నించింది. జర్నలిస్టు పరిస్థితిని ఆయన తరఫు న్యాయవాది వివరించగా, వాదనలు విన్న సుప్రీం మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 

More articles

Latest article