24.7 C
Hyderabad
Monday, August 3, 2026

కంది కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో కంది పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎఫ్ఏసీ జిల్లా మేనేజర్ డి.మహేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 56189 ఎకరాల్లో కంది పంట సాగు చేశారని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం  నాఫెడ్ తరపున కంది పంటకు క్వింటాల్ కు మద్దతు ధర రూ.7550 నిర్ణయించినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలను మద్నూర్, జుక్కల్, పిట్లం, బిచ్కుంద, తాడ్వాయి, బోర్లామ్, గాంధారి, పద్మాజీవాడి లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంది రైతులు ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

More articles

Latest article