27.3 C
Hyderabad
Friday, July 31, 2026

హాస్టల్ విద్యార్థులకు వైద్య పరీక్షలు

Must read

📰 Generate e-Paper Clip

మాచారెడ్డి, బతుకమ్మ: మండల కేంద్రంలోని బీసీ బాయ్స్ హాస్టల్ విద్యార్థుల కు సోమవారం మాచారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఆదర్శ్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. 43 మందిని పరీక్షించగా 22 మందికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు గుర్తించి వారికి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులకు పలు ఆరోగ్య సూచనలు చేశారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను కూడా పాటించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ వెంకటేశ్వరరావు, ఏ ఎన్ ఎం లు జయలక్ష్మి, లావణ్య, రజిత, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

More articles

Latest article