24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఇసుక స్కాం భరించలేక ప్రభుత్వానికి లెటర్

Must read

📰 Generate e-Paper Clip

లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో..

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలో ఇసుక స్కాం భరించలేక లారీ అసోసియేషన్ ప్రభుత్వానికి లెటర్ రాసింది. ’క్వారీల్లో ఇసుక నింపుకునేందుకు ఒక్కో ట్రిప్పుకు లారీ డ్రైవర్ల దగ్గర రూ.2500, ఇసుక ఓవర్ లోడ్ చేస్తూ రూ.12,000 వసూలు చేస్తున్నారు. వద్దన్నా వినకుండా కూడ పరిమితికి మించి ఇసుకను లోడ్ చేయడంతో పాటు మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ దౌర్జన్యం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. ఇసుక మైనింగ్ అధికారాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వొద్దని‘  ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

More articles

Latest article