వేల్పూర్, బతుకమ్మ : అతిగా మద్యం సేవించి వాహనం నడిపిన ఒకరికి ఆర్మూర్ మెజిస్ట్రేట్ గంగాధర్ రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు. మండలంలోని వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల లో రామన్నపేట్ గ్రామానికి చెందిన తెడ్డు రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఆర్మూర్ కోర్ట్ లో హాజరు పరచగా అతనికి మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ రెండు రోజుల జైలు శిక్ష విధించారు.
