బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండల కేంద్రంలోని తాసిల్ ల్దార్, ఎంపీడీవో, ఐకెపి, ఉపాధిహామీ, పోలీస్ స్టేషన్, ఎక్సైజ్ తదితర కార్యాలయాలను ట్రైనీ కలెక్టర్లు సందర్శించి అధికారులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ట్రైని ఐఏఎస్ లు శుభం పవర్, సత్యం, అనుజ్, శశాంక్, మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి, ఎస్సై విక్రమ్, ఏపీవో శకుంతల, డిప్యూటీ తాసిల్ ల్దార్ సుజాత తదితరులు పాల్గొన్నారు.
