26.6 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో ప్రధాన మోడీ పుణ్యస్నానం

Must read

📰 Generate e-Paper Clip

లక్నో, బతుకమ్మ: దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభ మేళాలలో పాల్గొన్నారు. వాయుమార్గం ద్వారా బుధవారం ఉదయం 10.30గంటలకు ప్రయాగ్ ఏరియాల్ ఘాట్ కు చేరుకున్న ఆయన, అనంతరం బోట్ లో త్రివేణి సంగమానికి చేరుకుని పవిత్ర స్నానం ఆచరించారు. సంగమంలో గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పవిత్ర నదీ జలాల్లోనే ఆయన జపం చేశారు. ఆయన వెంట ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. అనంతరం సాధు సంతులతో ఆయన సమావేశమై ఆధ్యాత్మిక అంశాలపై చర్చించనున్నారు. జనవరి 13న పుష్యపూర్ణిమ రోజున ప్రారంభమైన మహా కుంభ మేళ ఈనెల 26వ మహా శివరాత్రి వరకు కొనసాగనుంది.

More articles

Latest article