భీమ్ గల్, బతుకమ్మ : మండలం లోని పిప్రి గ్రామంలో నిర్మించిన శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆదివారం కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆవిష్కరించారు.శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులార్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యువత శివాజీ అడుగు జాడల్లో నడవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు, కాంగ్రెస్ మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
