25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

డ్రంక్ అండ్ డ్రైవ్ లో జైలు, జరిమానా

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : అతిగా మద్యం సేవించి వాహనం నడిపిన 15 మందికి శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహించి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ముందు హాజరుపరుచగా 10మందికి రూ.12.500 జరిమానా, ఐదుగురికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ సీఐ పి.ప్రసాద్ తెలిపారు. నగరంలోని ఖిల్లా రోడ్డు ప్రాంతానికి చెందిన ఎస్.కే.అప్రోజ్, మోపాల్ కు చెందిన చాకలి సుమన్, ఛత్తీస్ఘడ్ ప్రాంతానికి చెందిన అగందాస్, నాందేడ్ ప్రాంతానికి చెందిన డి.లక్ష్మణ్, ఖానాపూర్ ప్రాంతానికి చెందిన ఎల్.ఆత్మరాం లకు రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.

More articles

Latest article