27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

విధులకు ఆటంకం కలిగించిన ఒకరికి జైలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,వేల్పూర్: అతిగా మద్యం తాగి డయల్ 100కు ఏడుసార్లు ఫోన్ చేసి పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఒకరికి ఆర్మూర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ తెలిపారు. పచ్చల నడుకుడ గ్రామానికి చెందిన పులి సచిన్ తాగిన మత్తులో సోమవారం అర్థరాత్రి ఫోన్ చేసి తన వివరాలు చెప్పకుండా దుర్వనియోగం చేశాడని తెలిపారు. అతనిని అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఉపయోగపడే డయల్ 100 ను అవసరానికి మాత్రమే వినియోగించుకోవాలని వేల్పూర్ ఎస్ ఐ సంజీవ్ తెలిపారు.

More articles

Latest article