26.2 C
Hyderabad
Monday, August 3, 2026

అభివృద్ధి పనులకు నిధులు మంజూరు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, వేల్పూర్ : తన స్వంత గ్రామం వేల్పూర్ లో పలు అభివృద్ధి పనులకు మాజీ రాజ్యసభ సభ్యులు జోగిన పల్లి సంతోష్ కుమార్ తన నిధుల నుండి సుమారు రెండు కోట్ల రూపాయలు మంజూరు చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలో లేనందువల్ల అభివృద్ధి పనులకు నిధులు తీసుకు రావడం కష్టమవుతున్న తరుణంలో అప్పటి రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ని అడగగానే నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా సంతోష్ కు గ్రామ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article