నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని బోర్గాం కమాన్ ప్రాంతంలో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు దాడి చేసి ఒకరిని అరెస్ట్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ సీఐ వేంకటేష్ తెలిపారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఎన్ఫోర్స్మెంట్ టీం నిజామాబాద్ పట్టణంలో తనిఖీలు నిర్వహించిందని తెలిపారు. తనిఖీల్లో భాగంగా బోర్గాం కమాన్ వద్ద గౌతం నగర్ ప్రాంతానికి చెందిన కుమ్మ శ్రావణ్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతని వద్ద నుంచి 530 గ్రాములు ఎండు గంజాయి, సెల్ ఫోన్, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం ఎస్ హెచ్ ఓకు అప్పగించినట్లు తెలిపారు. ఈ దాడిలో ఎస్ఐ నర్సింహాచారి, సిబ్బంది భూమన్న, విష్ణు, అవినాష్, శ్యాం, సాయికుమార్ పాల్గొన్నారు.
