24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బిచ్కుంద : బిచ్కుందమండల వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలలో జాతీయ జెండాలను ఆదివారం ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ సురేష్, పోలీసు స్టేషన్ లో సీఐ జగడం నరేష్, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గోపాలకృష్ణ, వివిధ గ్రామాల్లో ఆయా పంచాయతీ సెక్రెటరీలు జాతీయా జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డా. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

More articles

Latest article