25.2 C
Hyderabad

ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్  వద్ద, గ్రామపంచాయతీ కార్యాలయం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, తహాసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, పోలీస్ స్టేషన్, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో  ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తహాసిల్దార్ కార్యాలయం వద్ద  తహాసిల్దార్ తారాబాయి, ఎంపీడివో కార్యాలయం వద్ద ఎంపీడివో సురేష్ బాబు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద సొసైటీ చైర్మన్ బద్దం సంజీవరెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తహాసిల్దార్ తారాబాయి, ఎంపీడీవో సురేష్ బాబు, డిప్యూటీ తహాసిల్దార్ సురేందర్ నాయక్, మాజీ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, పోలీసు అధికారులు, పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article