24 C
Hyderabad
Sunday, August 2, 2026

76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : ఆలూర్ మండలం కేంద్రం లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిచారు. ఈ సందర్బంగా తహసీల్దార్ రమేష్ మాట్లాడుతు మన దేశం 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకుని ప్రజాస్వామ్య దేశంగా మారింది అని, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, ప్రతి భారతీయుడి కర్తవ్యాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులతో పాటు కర్తవ్యాలను నిబద్ధతతో పాటించాలని తెలిపారు. సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి విలువలను గౌరవించి, దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలి అని అన్నారు.ఈ గణతంత్ర దినోత్సవం మనలో దేశభక్తి, ఐక్యత, సామరస్యం వంటి భావనలను మరింత బలపరచాలని ఆకాంక్షిస్తూ, అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్బంగా స్కూల్ పిల్లలకు బుక్స్, పెన్స్ అందజేశారు. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఆర్ ఐ రఫీక్, స్వాతి, వసుధర, దాస్, నరేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article