- ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్
ఎల్లారెడ్డి, బతుకమ్మ : లింగంపేట మండల కేంద్రంలోని నేలమత్తడి కట్టు కాలువ నిర్మాణంతో రైతుల ఏళ్ల కల నెరవేరిందని ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు అన్నారు. శనివారం లింగంపేట మండల కేంద్రంలోని కట్టు కాలవ నిర్మాణం పనులను, సిసి రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. లింగంపేట రైతుల వరప్రదాయిని కట్ట కాలువ పూర్తిగా మట్టితో కూడిక పోవడంతో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుసార్లు ప్రజాప్రతినిధులకు అధికారులు దృష్టికి తీసుకువచ్చిన ఫలితం లేకుండా పోయింది. ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్మోహన్రావు దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించి కట్టు కాలువ పునర్నిర్మాణానికి రూ.49 లక్షల నిధులు మంజూరు చేశారు. నిధులతో పనులు వేగవంతం కొనసాగుతున్నాయి. రానున్న ఖరీఫ్ సీజన్ నాటికి రైతులకు సాగునీరు అందించి తీరుతాయన్నారు. చెరువులు కుంటలు ఎప్పుడు నిండుకుండలా కళకళలాడాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసమే పనిచేస్తుందన్నారు.
