28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉన్నత లక్ష్యంతో శ్రద్ధగా చదవాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో శ్రద్ధగా చదివి జీవితంలో స్థిరపడే విధంగా అడుగులు వేయాలని మోర్తాడ్ విద్యాధికారి సమ్మిరెడ్డి అన్నారు. మోర్తాడ్ మండలంలోని డోన్ కాల్ గ్రామంలో గల జెడ్పిహెచ్ఎస్, ఎంపీపీఎస్  పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు క్రీడా దుస్తులు,బూట్లు వితరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్థానికుడు మామిడి రాజ్ పాల్ రెడ్డి, అతని మిత్ర  బృందం తరపున అందరు కలిసి సుమారు రూ.60,000  క్రీడా దుస్తులు, బూట్లను విద్యార్థులకు అందించడం జరిగింది. కార్యక్రమంలో కమ్మర్ పల్లీ విద్యాధికారి ఆంధ్రయ్య, పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు జగదీశ్వర్, పంచాయతీ కార్యదర్శి స్వప్న, గ్రామ అభివృద్ధి కమిటీ పెద్దలు శ్రీనివాస్, మల్లేష్, గంగారెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోశెట్టి, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Read carefully with a high aim

More articles

Latest article