29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

రేపు బీఆర్ఎస్ పార్టీ రైతు అధ్యయన కమిటీ జిల్లాకు రాక

Must read

📰 Generate e-Paper Clip

మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించిన బీఆర్ఎస్ పార్టీ రైతు అధ్యయన కమిటీ చైర్మన్,మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, కమిటీ సభ్యులు శనివారం అదిలాబాద్ నుండి బయలుదేరి నిజామాబాద్ జిల్లాకు చేరుకొంటారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలు ,రైతులు వ్యవసాయ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేస్తారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11.00 గంటలకు మెండోరా మండలంలోని బుస్సాపూర్ గ్రామంలో రైతులతో ముఖాముఖి తదనంతరం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఆర్గుల్ గ్రామంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా రైతులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.

More articles

Latest article