27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

మహిళా క్యారమ్స్ పోటీలో జిల్లాజడ్జి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : డెబ్భై ఐదవ గణతంత్ర దినోత్సవం నిర్వహించుకొనున్న చారిత్రాత్మక సందర్భంలో న్యాయమూర్తులు,న్యాయవవాదులు,న్యాయసిబ్బంది క్రీడోత్సవాలు జరుపుకోవడం ముదావాహమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్ లో మహిళా చెస్, క్యారమ్స్ పోటీలను ప్రారంభించి మహిళ న్యాయవాదులతో ఆటలు ఆడిన అనంతరం మాట్లాడారు. భారత దేశానికి స్వాతంత్య్రం లిఖించుకున్న రాజ్యాంగాన్ని నేటి తరానికి ఎరుక చేయడానికి ఆ ట,పాటల పోటీలను వినియోగించుకోవాలని కోరారు.దేశభక్తి గీతాలు ఆలపనలు యువతరంలో దేశభక్తి భావాన్ని పెంపొందించగలవని అన్నారు.కార్యక్రమంలో న్యాయవాదులు కవిత రెడ్డి,ప్రవీణ,కవిత గంగోనే, ఇందుమతి,అజిత రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

More articles

Latest article