- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి, బతుకమ్మ : వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందించాలనైన్స్టానిక సంస్థల అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం పిట్లం లోని జ్యోతిభా ఫూలే గురుకులాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వసతి గృహల్లోని విద్యార్థులకు శుభ్రమైన, రుచికరమైన భోజనం అందించాలని తెలిపారు. వంట గది లోని వంటలను, స్టోర్ రూం లోని సరుకులను ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థిని లతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో గురుకులం అధ్యాపకులు పాల్గొన్నారు.

