27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

  రైలు పట్టాలపై హోంగార్డ్ అత్మహత్య యత్నం

Must read

📰 Generate e-Paper Clip

. . . కాపాడిన రైల్వే పోలీసులు

. . . భార్య అత్త మామాల వేదింపులే కారణం

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ రైల్వే స్టేషన్  వద్ధ రైలు పట్టాల మీద హోంగార్డు ఓకరు అత్మహత్య యత్నం చేశారు. మంగళవారం తెల్లవారు జామును రైలు పట్టాల మీద ఓక వ్యక్తి  అత్మహత్యకు ప్రయత్నిస్తున్నాడని అతని భార్య డయల్  100 కు పోన్ చేసి సమాచారం అందించింది. కంట్రోల్ రూం ద్వార వచ్చిన సమాచారంతో రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి అక్కడ విధులు నిర్వహిస్తున్న రైల్వే పోలీస్ హెడ్ కానిస్టెబుల్ కుబేరుడు, కానిస్టేబుల్ రాములు లను అప్రమత్తం చేశారు. అక్కడ స్థానికంగా రైలు పట్టాలపై కుర్చున్న తాటికోండ నర్సయ్యను గుర్తించి సూసైడ్ అటెంప్ట్ ను అడ్డుకున్నారు. నిజామాబాద్ నగరంలోని జండాగల్లికి చెందిన తాటికోండ నర్సయ్య హోంగార్డ్  గా పనిచేస్తున్నారు.  అతని  భార్య అత్తమామాల వేదింపులు భరించలేకనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు రైల్వే పోలీసులకు తెలిపారు. అతడిని నాల్గవ టౌన్ పోలీసలకు అప్పగించినట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు.

Homeguard suicide attempt on railway tracks

More articles

Latest article