26.8 C
Hyderabad

కామారెడ్డి జిల్లాలో నకిలీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రైవేట్ ఆసుపత్రుల వద్ద వసూళ్ళు

 

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో నకిలీ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల బాగోతం బట్టబయలైంది. ప్రైవేట్ ఆసుపత్రులకు అనుమతి లేవని  తనిఖీలు చేసి డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిని  స్థానికులు పట్టుకున్నారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలో జరిగింది. మండల  కేంద్రంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ తనిఖీల పేరుతో డబ్బులు డిమాండ్ చేయగా అనుమానం వచ్చి పట్టుకున్నారు. అతన్ని గతంలో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన కంటి వెలుగులో తాత్కాలికంగా పని చేసిన బాలకృష్ణగా గుర్తించారు. వైద్య ఆరోగ్యశాఖలో పని చేసినప్పుడు పర్మిషన్ల పేరిట జరిగే వసూళ్ళను పక్కాగా చూసి పథకం ప్రకారం మారుమూల మండలాల్లో వసూళ్ళకు తెర లేపి చిక్కారు.

More articles

Latest article