27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఒకరికి ఏడాది జైలుశిక్ష

Must read

📰 Generate e-Paper Clip

మాక్లూర్, బతుకమ్మ : మాక్లూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన గురజాల ప్రవీణ్ ఒక మహిళ ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించి, ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ఒకరికి ఒక సంవత్సరం సాధారణ జైలుశిక్ష విధిస్తు నిజామాబాద్ నాల్గవ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వడ్డి హరి కుమార్ శుక్రవారం తీర్పు చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రవీణ్ 27 జులై,2016 న అర్థరాత్రి సమయంలో ఒక మహిళ తన ఇంటిలో నిద్రిస్తున్న వేళలో ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించి ఆమె గౌరవమర్యాదలకు విరుద్ధంగా ప్రవర్తించాడనే నేరారోపణలు కోర్టు నేర న్యాయ విచారణలో రుజువు కావడంతో ముద్దాయికి ఒక సంవత్సరం సాధారణ జైలుశిక్ష తో పాటు రెండు వేల రూపాయల జరిమానా విధించారు. పోలీసుల తరపున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ భూసారపు రాజేష్ గౌడ్ ప్రాసిక్యూషన్ నిర్వహించారు.

More articles

Latest article