28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎస్ఎస్ఆర్ లో సంక్రాంతి సంబరాలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని మాధవనగర్ లో గల ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూళ్లో శుక్రవారం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించినట్లు ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ మారయ్య గౌడ్ తెలిపారు.  ఈ సందర్భంగా చిన్నారులు సాంప్రదాయ దుస్తులు వేషధారణలో చూపరులను ఆకట్టుకున్నారు.

Sankranti celebrations in SSR

చిన్నారులు సంక్రాంతి సంబరాల్లో మునిగితేలారు. ఇందులో భాగంగా భోగి మంటలు, ఆటపాటలు, రకరకాల రంగుల ముగ్గులు, పిండి వంటలతో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఆట పాటల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ భాస్కర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sankranti celebrations in SSR

More articles

Latest article