బతుకమ్మ, వేల్పూర్ :- మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన మండల స్థాయి ప్రాథమిక పాఠశాలల క్రీడోత్సవాల్లో పడగల్ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు బహుమతులు గెలిచి సత్తా చాటారు. కబడ్డీ బాలురు మొదటి బహుమతి, కబడ్డీ బాలికలు ద్వితీయ బహుమతి, ఖో ఖో బాలికలు ద్వితీయ బహుమతి, పరుగు పందెం బాలురు ద్వితీయ బహుమతి, పరుగు పందెం బాలికలు ద్వితీయ బహుమతి, స్కిప్పింగ్ ద్వితీయ బహుమతులు గెలిచి మండల స్థాయిలో ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచారు.
