27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

కోటగిరి లో  బిఆర్ఎస్ నాయకులు ధర్నా

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ బతుకమ్మ : ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు  మంగళవారం కోటగిరి పోతంగల్ మండల కేంద్రాల్లో ధర్నా నిర్వహించారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్  మాట్లాడుతూ  రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో లో రైతుల కు సంవత్సరానికి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత 12,000 ఇస్తామనడం రాష్ట్ర రైతాంగానికి మోసం చేయడం సిగ్గుచేటని అన్నారు. మహిళలకు 2,500 ఇవ్వాలని, వికలాంగులకు పెన్షన్ 6 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోచి గణేష్ ,రమేష్ యాదవ్, ఎత్తుండా మాజీ ఎంపీటీసీ ఫారూఖ్,  పోతంగల్ మండల్ నాయకులు సుదం నవీన్, కోటగిరి మండల్ నాయకులు సమీర్, ఆరిఫ్, సాయిలు, సురేష్, హనుమంతు, రసూల్, ఆసిఫ్, గౌస్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article