30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

శాంతి భ్రదతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

Must read

📰 Generate e-Paper Clip

  • కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి

 

కామారెడ్డి, బతుకమ్మ : శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి హెచ్చరించారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్ ను మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సదర్భంగా సిబ్బంది పనితీరుని, వర్టికల్ సిస్టం, బ్లూ కోల్ట్, పెట్రోల్ కార్ డ్యూటీ లను గురించి తెలుసుకుని పలు సూచనలు చేశారు.  కోవడం  పట్టణ పీఎస్ పరిధిలో ఉన్న సస్పెక్ట్ షీట్ కలిగిన వ్యక్తులకు  పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు.  వారికి ఎలాంటి కేసులలో ఇన్వాల్వ్ కాకూడదని, ఎట్టి పరిస్థితులలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించరాదని హెచ్చరించారు. సరైన పద్ధతిలో ఉన్నవారికి, వారి మంచి నడవడిక ద్వారా వారిపై ఉన్న షీట్ లను తొలగిస్తామని తెలిపారు.  ఒకవేళ చెప్పిన విధంగా నడుచుకోకపోతే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More articles

Latest article