27.3 C
Hyderabad
Friday, July 31, 2026

సంక్రాంతికి 444 ప్రత్యేక బస్సులు

Must read

నిజామాబాద్, బతుకమ్మ : సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారి కోసం టీజీఎస్ ఆర్టీసీ, నిజామాబాద్ రీజియన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు రీజినల్ మేనేజర్ టి.జ్యోష్న తెలిపారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 444 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ 1,2, బాన్సువాడ, కామారెడ్డి నుంచి హైదరాబాద్, విజయవాడ వరక ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. జనవరి 9 నుంచి 12 వరకు, జనవరి 16 నుంచి 20 వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డనరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఆర్మూర్ – 7382843133, బోధన్ – 9849500725, నిజామాబాద్ – 9959226022, బాన్సువాడ – 9491105706, కామారెడ్డి – 08468 220281 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article