26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఎన్డిపి మద్యం పట్టివేత 

Must read

📰 Generate e-Paper Clip

నవీపేట్, బతుకమ్మ ;నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని పట్టుకున్నారు. మహారాష్ట్ర నుంచి నవిపేటకు మద్యం రవాణా అవుతుందన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ స్వప్న ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా సరిహద్దులోని నవీపేట్ మండలం యంచ వద్ద కారులో తరలుతున్న మధ్యాన్ని పట్టుకున్నారు. నవీపేట కి చెందిన  నవరూపాచారి అనే వ్యక్తి స్విఫ్ట్ డిజైర్ కార్ లో మహారాష్ట్రలోని ధర్మాబాద్ నుంచి సిడాస్ ప్రీమియం వైన్ 15 బాటిల్లు, రాయల్ చాలెంజ్ రెండు లీటర్ల బాటిల్ రెండు, నాలుగు దేశిదారు బాటిల్ ను అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతామని మధ్యన్ని సీజ్ చేసినట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ స్వప్న తెలిపారు.

More articles

Latest article