29 C
Hyderabad
Monday, August 3, 2026

నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికి నిధులు ఇచ్చిన సీయం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు

Must read

📰 Generate e-Paper Clip

  • కవిత ఎంపీ గా నిజామాబాద్ కు చేసిన ఒక్క అభివృద్ధి పని లేదు
  • నుడా చైర్మన్ కేశ వేణు

 నిజామాబాద్ సిటి, బతుకమ్మ: నిజామాబాద్ అర్బన్  నియోజకవర్గంలోని అన్ని డివిజన్ లలో సిసి రోడ్లు డ్రైనేజీల నిర్మాణాల కోసం రూ. 60 కోట్ల రూపాయలను మంజూరు  చేసిన సీయం రేవంత్ రెడ్డికి నిజామాబాద్ ప్రజల తరఫున నిజామాబాద్ అర్బన్ డేవలప్ మెంట్ అథార్టి చైర్మెన్ కేశ వేణు ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుదవారం నగర కాంగ్రెస్ అధ్యక్షులు నూడ చైర్మన్ కేశ వేణు విలేకరుల  తో మాట్లాడుతు…. నగరంలో అమృత్ స్కీం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కొరకు 400 కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఆ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోని ప్రజలకు ఇచ్చిన హామీలలో దాదాపు 80% హామీలను పూర్తి చేయడం జరిగిందని అన్నారు. కానీ గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆయన అన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత నిజామాబాద్ కు చుట్టపు చూపుగా వచ్చిన కవిత రాష్ట్రంలో నిజామాబాద్ అర్బన్ లో అభివృద్ధి జరగడం లేదని మాట్లాడుతున్నారని పెర్కోన్నారు. గతంలో కవిత ఎంపీగా ఉన్నప్పుడు నిజామాబాద్ లో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని, కేవలం ముఖ్యమంత్రి కూతురుగా హోదాను మాత్రమే అనుభవించిందని ప్రజల గురించి ఏ రోజు ఆలోచించలేదని ఆయన అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిజాంసాగర్ ఫ్యాక్టరీ మూత పడిందని ఆ సమయంలో ఎంపీగా ఉన్న కవిత ఏ రోజు మాట్లాడలేదని ఆన్నారు. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు. అదే విధంగా బిజెపి ఎంపీ అరవింద్ తనకు మోడీతో దగ్గర సంబంధం ఉంది అని చెప్తున్నాడని నిజామాబాద్ పార్లమెంటు లో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా తీసుకురాలేదని, కేవలం ప్రగల్బాలు పలకడానికి ఆరవీంద్ సరిపోతున్నాడని ఇకనైనా ప్రజలకు సేవ చేయాలని హితవు పలికారు. మరొక్క సారి కవిత కాంగ్రెస్ ప్రభుత్వం పై అబద్ధపు మాటలు పట్లడితే మహిళా కాంగ్రెస్ నాయకులు తరిమి కొడతారని కేశ వేణు అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జావేద్ అక్రమ్, కార్పొరేటర్ క్కుద్దస్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, కార్పొరేటర్ రోహిత్, బీసీ సెల్ నగర అధ్యక్షులు నాగరాజు, ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు వినయ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ మహేష్, లవంగ ప్రమోద్, మహిళా కాంగ్రెస్ నాయకులు పద్మ, అపర్ణ, శుభం, అయ్యూబ్, ఆకుల మహేందర్, సాయి కుమార్, హరూల్ ఖాన్, కుద్దస్, వాలి మరియు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article